ఇండిపెండెంట్ చైర్మన్ అభ్యర్థి నజీర్ అహ్మద్ విస్తృత ప్రచారం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి : పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 1వ, 23వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి, మాజీ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి సోమశేఖర్, 23వ వార్డు అభ్యర్థి ఉమాదేవికి మద్దతుగా ఆయా వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని అభ్యర్థులు తెలిపారు.నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో పట్టణ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. తనకు కేటాయించిన సిలిండర్ గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని కోరారు.ఈ ప్రచారంలో అభ్యర్థులు సోమశేఖర్, ఉమాదేవి, వారి మద్దతుదారులు పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా