29వ వార్డులో టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు విస్తృత ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 29వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పవిత్ర రఘు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ స్థానికులను కలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో పాటు తనకు కూడా ఓటు వేసి సైకిల్ గుర్తుపై మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు