21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ విస్తృత ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్: పలమనేరు మున్సిపాలిటీలోని 21వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జీకే మనీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ వీధుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. స్థానికులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి ఒక ఓటు, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం కొనసాగించారు.
పలమనేరు మేజర్ న్యూస్, రిపోర్టర్, అనిల్ కుమార్ యాదవ్.