చివరి రోజు హోరెత్తిన వైసిపి ప్రచారం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి, మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజైన గురువారం వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులు పట్టణంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి నాయకత్వంలో 32, 41, 2, 3, 4వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బనవాసి బసిరెడ్డి, వివిధ వార్డులg అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
A. R. శరత్ కుమార్
సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా..