20వ వార్డులో టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ విస్తృత ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 20వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి నూరి ఇక్బాల్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. వార్డులోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటూ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.ఈ సందర్భంగా వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తికి ఒక ఓటు, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నూరి ఇక్బాల్‌కు మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్