BREAKING
నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రైతులకు పిలుపునిచ్చారు. నేల సారాన్ని కాపాడుకుంటూ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు.
శుక్రవారం భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాగుభూమి సంరక్షణ’ రైతు అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో సాధారణం కంటే 35 నుంచి 36 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, భీంపూర్ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిందని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల పట్ల బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పాత బకాయిలు, రుణాల వసూళ్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.పిప్పల్‌కోటి రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియకు సంబంధించి అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి భూములు కోల్పోతున్న రైతులందరికీ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. జందాపూర్, చందాటి ప్రాంతాల్లో మత్తడి వాగు సమస్యలు, రైతుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ (వీబీ-జీ రామ్ జీ) పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర నీటి కుంట) పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రజలకు సూచించారు. వ్యవసాయంలో నేల యాజమాన్యం, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణకు సంబంధించి కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణ పనులు త్వరగా పూర్తికావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డి ఎ ఓ రవీందర్ సింగ్, డీఆర్‌డీఓ పీడీ రాథోడ్ రవీందర్, కేవీకే శాస్త్రవేత్త రాంగోపాల్ వర్మ, తహశీల్దార్ రమేష్ నాయక్, ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్, నాయకులు భోజారెడ్డి, నారాయణ, ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.