BREAKING
మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు వియత్నాం దేశంలో విద్యా విషయక కార్యక్రమాలను అధ్యయనం చేసిన జిల్లా బృందం తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 21వ వార్డులో టీడీపీ అభ్యర్థి జీకే మనీ విస్తృత ప్రచారం రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలని అనుసరించాలి - కలెక్టర్ రాజర్షి షా 29వ వార్డులో టీడీపీ అభ్యర్థి పవిత్ర రఘు విస్తృత ప్రచారం కేంద్ర మంత్రి తోఖన్ సాహుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ఘన స్వాగతం ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు 30వ వార్డులో టీడీపీ అభ్యర్థి మహబూబ్ బాషా ముమ్మర ప్రచారం 20వ వార్డులో టీడీపీ అభ్యర్థి నూరి ఇక్బాల్ విస్తృత ప్రచారం అనాధ వృద్ధులకు అన్నదానం... ఘనంగా జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య దివ్యాంగ చిన్నారులకు విద్యాసామాగ్రి పంపిణీ... ఘనంగా మాజీ సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్

Select Suryaa Now
ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శిక్షణ తరగతులు  ---ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్

ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించి, ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఖమ్మం అర్బన్ మండలంలోని బల్లేపల్లి ఎం .పి.పి.ఎస్  పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకులు, కార్పొరేట్ ట్రైనర్ డా. కె.వి. నారాయణ్ హాజరై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంగ్ల భాషను సులభంగా ఎలా నేర్చుకోవాలి, రోజువారీ జీవితంలో ఆంగ్ల పదాలను, వాక్యాలను ఎలా ఉపయోగించాలి, ఎలాంటి భయం లేకుండా ఆంగ్లంలో ఎలా మాట్లాడాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ, ఆంగ్ల భాషపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా పలు సూచనలు చేశారు. నిరంతర సాధనతో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం సాధ్యమని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. వెంకట కుమారి, ఉపాధ్యాయురాలు సరస్వతి పాల్గొన్నారు. విద్యార్థులకు ఇలాంటి ప్రత్యేక శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.