BREAKING
నో ఆక్షన్ ప్రాజెక్ట్‌తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి భయపడిన సన్నీ డియోల్.. 'ఇక్కా' వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్! ఢిల్లీ సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ బస్సులో ప్రయాణించిన మంత్రి వాకిటి శ్రీహరి బాక్సాఫీస్ వద్ద 'ఉడ్తా తీర్' హవా.. తొలి వారంలో రూ.30 కోట్ల క్లబ్‌లో ఆయుష్మాన్ ఖురానా సినిమా! 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ --- కమిషనర్ నందన్ కన్నెపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓగా క్రాంతి కుమార్ బద్రీనాథ్‌ నుంచి వస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం.. జోషీమఠ్‌ సమీపంలో 6 మంది దుర్మరణం నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ ORR పై రోడ్డు ప్రమాదం - మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు ప్రజా ప్రభుత్వానికి నీతులు చెప్పే అర్హత బీఆర్ఎస్‌కు లేదు టిపిసిసి అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

Select Suryaa Now
ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

ఏపీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు మిర్యాలగూడ డివిజన్ బృందాలు

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ సహాయక బృందాలను పంపించింది. ఇందులో భాగంగా మిర్యాలగూడ విద్యుత్ డివిజన్ నుంచి ప్రత్యేక బృందాలు ఏపీకి బయలుదేరాయి.

టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జితేష్ పాటిల్, ఐఏఎస్ ఆదేశాల మేరకు నల్లగొండ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు.

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రత్యేక వాహనాలు, అత్యాధునిక బ్యాటరీ ట్రీ ప్రూనర్లు, అవసరమైన అత్యవసర పరికరాలతో మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన విద్యుత్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున ఏపీకి బయలుదేరారు. ఉన్నతాధికారులు జెండా ఊపి బృందాల వాహనాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆచారి, డివిజన్ ఏడీఈలు తిరుపతయ్య, కోడిరెక్క రవికుమార్, ఇందిరా, ఏఈలు వినోద్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జానయ్య, కృష్ణారెడ్డి, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు మారం శ్రీనివాస్, వీరభద్రం, ఎల్లయ్య చారి, బిక్షం, జలంధర్, భాస్కర్, సతీష్, వెంకటరత్నంతో పాటు పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.