నూతన ఎంపీడీవోను కలిసిన వీణవంక కాంగ్రెస్ పార్టీ నాయకులు
సూర్య వీణవంక : వీణవంక.మం డలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డిని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.మండల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై నాయకులు ఎంపీడీవోతో చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వీణవంక మండల , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, సతీష్ గౌడ్, చేపూరి రాజు , తదితరులు పాల్గొన్నారు.