దివ్యాంగ చిన్నారులకు విద్యాసామాగ్రి పంపిణీ... ఘనంగా మాజీ సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు
వేంపల్లె, మేజర్ న్యూస్:స్థానిక భవిత దివ్యాంగ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు భోజనంతో పాటు వాటర్ బాటిల్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. శుక్రవారం మాజీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువనేత రాచినేని వేణుగోపాల్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి ఆది నారాయణ రెడ్డి, నాయకులు సింగారెడ్డి భరత్ కుమార్ రెడ్డి, భూషణం, పుల్లయ్యతోట నాగేష్, బ్రహ్మనంద కుమార్, నల్లాగు ఆది నారాయణ, లోకేష్, రాహుల్ తదితర అభిమానులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గండికోట షేక్ ఖదీర్ వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.