యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ ను నియమించిన బీర్ల ఐలయ్య
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో శ్రీ బీర్ల ఐలయ్య గారి చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ గారిని నియమించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందుకోవడం జరిగింది ఈ నియామక పత్రాన్ని అందించినందుకు ఐలన్న గారికి మరియు రోడ్డు భవనాల శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జిల్లా ఎమ్మెల్యేలకు భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నేను పార్టీ కోసం 30 సంవత్సరాలు కష్టపడినందుకు నాకు ఈ గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ మండల కాంగ్రెస్. పార్టీ నాయకులు మరియు పోతిరెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు