BREAKING
ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా నటి త్రిష.. వెండితెరపై మరోసారి ‘పురట్చి తలైవి’ పాత్రలో సంచలనం? హెబ్రాన్‌లో ఇజ్రాయెల్ ఆంక్షలు.. 10 మార్గాలు మూసివేత, 5 వేల మంది నిరాశ్రయులు కాళేశ్వరం వైఫల్యానికి బీఆర్ఎస్ తప్పిదాలే కారణంః మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ డోన్‌లో రూ.1.47 లక్షల నగదు సీజ్: 16 మంది వైకాపా నాయకుల అరెస్ట్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. డ్రోన్ దాడి ఆరోపణలు, హోర్ముజ్‌లో ట్యాంకర్‌పై పేలుడు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పట్టపగలే డ్రంకెన్ డ్రైవ్.. ఐదుగురు పట్టివేత పెద్దపంజాణి యుటిఎఫ్ నూతన కార్యవర్గం బోయినపల్లి గురుకుల విద్యార్థుల చిత్రకళకు జిల్లా పాలనాధికారి ప్రశంసలు పొగాకు వినియోగానికి దూరంగా ఉండండి నాలుగో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా! భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంజిల్లా కలెక్టర్ కె. హైమావతి త్రాగునీరు వృధా చేయవద్దు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం స్వర్ణ వైద్యశాలను సందర్శించిన బాపట్ల జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు

అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన

Select Suryaa Now
అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన

సూర్య న్యూస్ అద్దంకి.:అద్దంకి పట్టణంలోని 31, 32 వార్డులకు సంబంధించి ఎన్టీఆర్ నగర్ లోనూ 19, 20, 21, 22 వార్డులకు సంబంధించి పాత ఎల్ఐసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన  మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములకు విముక్తి కల్పించామన్నారు. అద్దంకి పట్టణ ప్రజల కోసం రూ. 100 కోట్లతో చేపట్టిన రక్షిత మంచినీటి పథకాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు అద్దంకి పట్టణ, పరిసర ప్రాంతాల్లో మూడు సబ్ స్టేషన్లు, నలభై ఏళ్లకు పై బడిన విద్యుత్ స్తంభాలన్నీ మార్చినట్లు తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో గ్రంథాలయం, టౌన్ హాలు, ఇండోర్ షటిల్ కోర్టులు, జిమ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రూ.32 కోట్లతో దర్శి- అద్దంకి గుండ్లకమ్మ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, రూ.5.70 కోట్లతో బస్ స్టాండ్ అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. 

అభివృద్ధి పనులకు కట్టుబడి ఉన్నాం.. బెదిరింపులకు భయపడేదే లేదు.

ప్రజా సమస్యల పరిష్కారమే  ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, అనవసరమైన బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు అభివృద్ధికి అడ్డుపడేందుకు పిచ్చి మార్గాలు ఎంచుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. ఎవరికీ, ఎలాంటి కేసులకు భయపడాల్సిన పనిలేదని కార్యకర్తలకు, ఎన్టీఆర్ నగర్ ప్రజలకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మంత్రితో పాటు బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకలు గంగాధరరావు, చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్ స్థానిక నేతలు, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు ఉన్నారు.