మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ
ఆత్మకూరు /మేజర్ న్యూస్: మేడేపల్లి లో మహిళా మండలి భవన నిర్మాణానికి శుక్రవారం ఉదయం భూమి పూజ చేయడం జరిగింది. గ్రామంలో మహిళలకు ప్రత్యేక భవనము నిర్మించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎంపీడీవో శ్రీరామ్ రెడ్డి, మేడేపల్లి గ్రామ సర్పంచ్ చంద్రాయుడు పంచాయతీ కార్యదర్శి శిరీష, ఉపసర్పంచ్ దొరబాబు, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తులసిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ పరమేష్ వార్డు సభ్యులు మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.