పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
చింతపల్లి మేజర్ న్యూస్ నల్గొండ జిల్లా : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నట్వ. గిరిధర్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రులు తమ హక్కును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన పట్టభద్రులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. పట్టభద్రుల సౌకర్యార్థం చింతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఓటు నమోదు కోసం ఎలాంటి ఖర్చు లేకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని, మండలంలోని అన్ని గ్రామాల పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలంలోని అర్హులైన పట్టభద్రులు ఈ విషయాన్ని గమనించి తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామాల్లోని ఇతర పట్టభద్రులకు కూడా సమాచారం అందించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగంపల్లి. భాస్కర్, కొలుకులపల్లి. కొండల్, నల్ల. శంకర్, ఎండీ. ఫయాజ్, సిద్ధే స్వామి, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.