నిజాంపేట నూతన మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అజ్గర్ ఎన్నిక
రామాయంపేట; మైనార్టీల సంక్షేమం.. ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని నిజాంపేట నూతన మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అజ్గర్ అన్నారు. శనివారం నిజాంపేట ముస్లిం మైనార్టీ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహమ్మద్ అజ్గర్, కోశాధికారిగా మహమ్మద్ బాబు మియా, కార్యదర్శిగా మహమ్మద్ జాఫర్, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ పాషా, సలహాదారులుగా మహమ్మద్ నాయబ్, గౌస్ పాషా, అబ్దుల్ అజీజ్,సర్దార్‌లను ఎంపిక చేశారు. అనంతరం అధ్యక్షుడు అజ్గర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం సోదరులందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా తోడ్పడటంతోపాటు, మండల అభివృద్ధి కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. మైనార్టీల ఐక్యత, సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు మహమ్మద్ ఇబ్రహీం, రఫీ, ఖాసీం, మీర్జా, ఫాజిల్, అజీజ్ మియా, బాబు, రఫీల్ తదితరులు పాల్గొన్నారు.