నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ మరొకరి కోసం గాలింపు
రాయదుర్గం,మేజర్ న్యూస్ : నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్‌ను అసలైనవిగా నమ్మించి విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి నకిలీ ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అల్తమాష్ (26) ప్రస్తుతం మలక్‌పేట సైద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. నకిలీ, క్లోన్ చేసిన ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్‌ను అసలైనవిగా నమ్మించి విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు.
అతడి వద్ద నుంచి రెండు ఐఫోన్లు (ఒకటి నకిలీది), నాలుగు నకిలీ ఆపిల్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో ఘజియాబాద్‌కు చెందిన ఆవేష్ ఖాన్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అల్తమాష్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.ఏసీపీ మాదాపూర్ డివిజన్ మార్గదర్శకత్వంలో రాయదుర్గం ఎస్‌హెచ్‌ఓ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కె. రామిరెడ్డి, క్రైమ్ సిబ్బంది కేసును ఛేదించారు. సిబ్బందిని ఏసీపీ అభినందించారు.