కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి అన్నదానo కొరకు 1,00116, విరాళం అందజేసిన ఇనకొండ చంద్రారెడ్డి
మర్కుక్ :సిద్దిపేట జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమురవెల్లి ఆలయానికి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, (మహాలక్ష్మి ఫ్రైడ్ ప్రైవేట్ లిమిటెడ్ ) ఇనకొండ చంద్రారెడ్డి కొమరవెల్లి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి శనివారం 1,00116 ( ఒక లక్ష నూట పదహారు) రూపాయలు విరాళం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని,కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ దైవభక్తి సేవా గుణం కలిగి ఉండాలని అన్నారు, వారితో పాటు ప్రణీత రెడ్డి భావిక్ రెడ్డి అక్షిత రెడ్డి హర్షవర్ధన్ రావు లక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, వారిని స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నా రు