BREAKING
అమరవీరుల వారోత్సవాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అంబ‌రాన్నంటిన మ‌హిళా శ‌క్తి సంబ‌రం.. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం విజిలన్స్ అవగాహన సదస్సు బిగ్ బాస్ 10 తెలుగులో ఊహించని ట్విస్ట్: డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ అవుట్! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం *హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం* ఆర్నబ్ తుఫాను విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మిట్ట కందల గ్రామంలో టీడీపీ అభ్యర్థుల ప్రచారం జోరు సోషల్ మీడియాలో నటి అనుపమ పరమేశ్వరన్ సంచలన పోస్ట్: అసలు విషయం అదేనంటూ పరోక్ష విమర్శలు! ఎంపీపీ అభ్యర్థి డోల బాబ్జి, జడ్పిటిసి అభ్యర్థి పుష్పలను గెలిపించండి ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ * ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత

కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం

Select Suryaa Now
కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం

పూసపాటిరేగ, సూర్య : పూసపాటిరేగ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కూటమి ప్రభుత్వం తరఫున జడ్పిటిసి ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న కోట్ల రేవతి గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచార జోరులో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు జనసేన నాయకుడు, జడ్పిటిసి గా పోటీ చేస్తున్న రేవతి భర్త అయిన కోట్ల రఘు మరోవైపు ఎన్నికల ప్రచార  హోరెత్తిస్తున్నారు. రె ల్లి వలస1,2 ప్రాదేశాలలో రేవతి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించగా జనసేన నాయకుడు కోట్ల రఘు పసుపం సిగ్మెంట్ పరిధిలో ఉన్న ఎరుకొండ గ్రామంలో భార్య రేవతి తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఎంపీటీసీ అభ్యర్థి దువ్వు అప్పలస్వామితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వలన బోగాపురం ఎయిర్పోర్ట్ సేవలు వలన స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని, పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు కూడా విలువలు పెరిగిన విషయాన్ని రఘు గుర్తు చేశారు. మండలంలో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, గత పాలకుల నిర్లక్ష్యం వలన గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని రఘు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి తరుపున పోటీ చేస్తున్న జడ్పిటిసి అభ్యర్థి కోట్ల రేవతి ఘన విజయం సాధించడం ఖాయమని, మెజార్టీ పైనే ఆలోచించుకోవలసి ఉందని, కోటమ నాయకులంతా సఖ్యతగా పనిచేస్తే మరింత మెజారిటీ సాధిస్తామన్న ఆశాభవాన్ని రఘు వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి తరుపున పోటీ చేస్తున్న జనసేనతో పాటు తెదేపా భాజపా అభ్యర్థులను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తన ఎన్నికల ప్రచార సభలో రఘు స్పష్టం చేశారు. అనంతరం కూటమి నాయకులు అప్పలస్వామి, కంది వెంకటరమణ, తమ్మి నాయుడు, శ్రీను లతో ప్రత్యేక సమావేశాన్ని రఘు నిర్వహించి కూటమి అభ్యర్థుల తరఫున అత్యధిక మెజార్టీ వచ్చేందుకు తీసుకోవలసిన వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల అయ్యేవరకు గ్రామాల్లోనే ఉంటూ వైరి పక్షం కుట్రలకు కుతంత్రాలకు పాల్పడే అవకాశం ఉందని, కూటమి నాయకులంతా కుట్రలను తిప్పుకొట్టే విధంగా వ్యూ హాత్మకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా రఘు నాయకులకు ఉద్బోధ చేశారు.