ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఆమె విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ సమగ్రత, సమైక్యత కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ చూపిన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.