BREAKING
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత

కవిత ముందు కుటుంబం గురించి మాట్లాడాలి: భవాని రెడ్డి

Select Suryaa Now
కవిత ముందు కుటుంబం గురించి మాట్లాడాలి: భవాని రెడ్డి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుటుంబం గురించి మాట్లాడటం సరికాదని టీపీసీసీ అధికార ప్రతినిధి భవాని రెడ్డి విమర్శించారు. బల్మూరు వెంకట్ లేవనెత్తిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని కవితకు సూచించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టుపై కవిత తన తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించాలని అన్నారు. కరువు పరిస్థితులపై హరీశ్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తోందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని, గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని భవాని రెడ్డి పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.