BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

కష్టంలో అండగా నిలిచిన టెన్త్ క్లాస్ స్నేహం..*మాధురి చిన్నారి హార్ట్ సర్జరీకి రూ.40,000 సాయం*

Select Suryaa Now
కష్టంలో అండగా నిలిచిన టెన్త్ క్లాస్ స్నేహం..*మాధురి చిన్నారి హార్ట్ సర్జరీకి రూ.40,000 సాయం*

సూర్య,అశ్వారావుపేట,అశ్వారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 2004-2005 పదవతరగతి స్నేహితులు మానవత్వం చాటుకున్నారు.స్నేహం అంటే కేవలం పాఠశాల రోజుల్లో కలిసి చదువుకోవడం, కలిసి నవ్వుకోవడం మాత్రమే కాదు.. కష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలబడటమే నిజమైన స్నేహమని టెన్త్ క్లాస్ స్నేహితులు మరోసారి నిరూపించారు.తమ టెన్త్ క్లాస్ స్నేహితురాలు మాధురి ఈరోజు తమ మధ్య లేకపోవడం అందరినీ ఎంతో బాధించింది. తల్లిని కోల్పోయిన ఆ చిన్నారి హార్ట్ సర్జరీ కోసం స్నేహితులందరూ కలిసి ముందుకు వచ్చారు.ఈ మేరకు స్నేహితులు అందరూ కలిసి సేకరించిన రూ.40,000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఆ చిన్నారి కుటుంబానికి అందించారు.ఈ సహాయం కేవలం డబ్బు మాత్రమే కాదని, ఆ చిన్నారికి తాము ఇచ్చిన భరోసా, స్నేహితురాలి కుటుంబానికి అందించిన ఆత్మీయత అని స్నేహితులు తెలిపారు.

ఈ మంచి కార్యక్రమంలో తమ వంతుగా ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ స్నేహితులు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఆ చిన్నారి హార్ట్ సర్జరీ విజయవంతంగా జరిగి, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వరావుపేట