BREAKING
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* జిల్లా కలెక్టర్ కు ఏ ఫామ్ అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మూడవ రోజుకు చేరిన 59వ గ్రంథాలయ వారోత్సవాలు : గ్రంథాలయ ఉద్యమకారుల సేవలను స్మరించుకున్న ప్రముఖులు : హాజరైన చిత్తూరు జిల్లా స్కౌట్స్ కమిషనర్ శకుంతలమ్మ సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి సంజీవని’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు ఆపదలో ఉన్న పాత్రికేయుడికి మున్సిపల్ చైర్మన్ ఆపన్నహస్తం : రూ.30 వేలు ఆర్థిక సాయం అందించి శ్రీరామ్ చినబాబు బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు? పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం

Select Suryaa Now
గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం
సూర్య,కాగజ్‌నగర్: హిందూ సంస్కృతిలో గోమాతకు విశిష్టమైన స్థానం ఉందని, గోవులను పూజించడం, సంరక్షించడం మన సంప్రదాయంలో భాగమని చాటిచెప్పేలా కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై ఉన్న శ్రీకృష్ణ గోశాలను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, కొమురం భీం ఆసిఫాబాద్ మరియు సిర్పూర్ కోర్టు ఇన్‌చార్జి శ్రీమతి అనంతలక్ష్మి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గోవులకు పండ్లు, పచ్చగడ్డి తినిపించి గోసేవ నిర్వహించారు.అనంతరం గోశాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. గోమాతను పూజించడం మాత్రమే కాకుండా, వాటిని ప్రేమతో సంరక్షించడం, ఆహారం అందించడం, సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పేలా ఆమె గోసేవలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి హనుమాన్ విగ్రహంతో పాటు దుర్గామాత, రమా సత్యనారాయణ స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకన్న గౌడ్, శ్రీకృష్ణ గోశాల కమిటీ అధ్యక్షుడు సూర పరమేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి పోతురాజుల లక్ష్మణ్, సహ కార్యదర్శి పోలోజు శ్రీనివాస్, సభ్యులు అరుణ్ అగర్వాల్, ప్రసాద్, సత్యనారాయణ, రమేష్, శివప్రసాద్, హరిప్రసాద్, వరప్రసాద్, శంకరయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.