జిల్లా కలెక్టర్ కు ఏ ఫామ్ అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని మార్కాపూర్ జిల్లాలోని పొదిలి నగర పంచాయతీకి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఏ ఫామ్ ను నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా మార్కాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత గారిని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ ఎన్నికల ప్రశాంతంగా ప్రజాస్వామ్య బద్ధంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సైదా కోరారు.