వేటజంగాలపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థిగా పూడి మంగ నామినేషన్.
అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ న్యూస్: అనకాపల్లి నియోజకవర్గం వేటజంగాలపాలెం గ్రామ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా (తెలుగుదేశం పార్టీ) మాజీ సర్పంచ్ పూడి చిన్నారావు కుమారుడు పూడి రాజు మంగ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ, సీఎం రమేష్, రాంకీ తదితరుల ఆశీస్సులతో ఆమె నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కశింకోట మండల జనసేన పార్టీ నాయకులు భీమరశెట్టి చిన్నికృష్ణ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థి పూడి రాజు మంగతో కలిసి భీమరశెట్టి చిన్నికృష్ణ స్వయంగా పిసినికాడ పంచాయతీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేటజంగాల పాలెం గ్రామ మాజీ సర్పంచ్ పూడి చిన్నారావు, వేటజంగాలపాలెం గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామ నాయకులు, తెలుగు యువత నాయకులు, కూటమి నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.