BREAKING
విజనరీ 2026 నేషనల్ అవార్డు గ్రహీత నార్ని అమరచంద్ వశిష్ట రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రింటర్ అందజేత ఆత్మకూరు ప్రాదేశిక ప్రతినిధుల ప్రమాణ స్వీకారం రేపే --ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నిక బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి శ్రీ అలగనాథస్వామి దేవస్థానంలో వైభవంగా కార్తీక ఆకాశ దీపోత్సవం, స్వామివారి కల్యాణ మహోత్సవం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి - టిడిపి పరిశీలకులు మోహన్ రెడ్డి గోమాతల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - హనుమాన్‌ గోశాల, క్షత్రియ పాఠశాలలో ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేయూత పెన్షన్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం పొట్లమర్రి పంచాయితీ లో తెదేపా హవా. గంటాపురం పరిధిలో ఆరు వార్డులు ఏకగ్రీవం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైసిపి ప్రజాప్రతినిధులు ఆశీస్సులు తీసుకున్న జి మధు రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ ను సన్మానించిన గ్రామస్తులు

ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు

Select Suryaa Now
ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు
సూర్య, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని తిలక్ నగర్‌లో ఏళ్ల తరబడి నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడం లేదని స్థానికుడు తొగరి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదని, సమస్య యథాతథంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం లక్షెట్టిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్‌కు దరఖాస్తు అందజేశారు. ప్రజావాణి ద్వారా అయినా సమస్యపై అధికారులు స్పందించి తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.