telangana
ప్రజావాణికి మూడు దరఖాస్తులు
సూర్య, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ తెలిపారు.ఈ సందర్భంగా అందిన దరఖాస్తుల్లో మెప్మా టైలరింగ్ బిల్లుల చెల్లింపు, రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. అలాగే పట్టణంలోని తిలక్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.ప్రజల నుంచి మొత్తం మూడు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో అనిల్ వెల్లడించారు.ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.