BREAKING
జార్ఖండ్‌లో ఘనంగా ముగిసిన ఛఠ్ పూజ వేడుకలు ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు రావణాసురుడు ఒరిజినల్ టెక్ బ్రో.. టెక్ బిలియనీర్లతో పోల్చిన ట్వింకిల్ ఖన్నా! జాతీయ పత్రికా దినోత్సవం: మీడియా భవిష్యత్తుపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు! నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చివేత.. రూ.6 లక్షల నష్టం! • ప్రజావాణిలో బాధితుడి ఆవేదన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ విధ్వంసం.. 11 రోజుల్లో రూ.1,384 కోట్లతో పలు రికార్డులు బద్దలు! అంతర్జాతీయ వాణిజ్య మేళాలో బీహార్ పెవిలియన్ సందడి: ఆకట్టుకుంటున్న మినీ-మ్యూజియం! నటుడు శరద్ కపూర్‌ను కలిసిన సోనూసూద్.. అనారోగ్య పరిస్థితిపై ఆరా! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం కైరోలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు! ప్రజావాణికి మూడు దరఖాస్తులు సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్!

మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్..

Select Suryaa Now
మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్..

 

శ్రీకాకుళం, నవంబర్ 16 మేజర్ న్యూస్:

శ్రీకాకుళం నగర మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోమవారం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రీజినల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబును కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి మద్దతుగా నిలవాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అందరి సమిష్టి కృషి, ఐక్యతతో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించగలమని ధర్మాన కృష్ణదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 బి.గోపాలకృష్ణ (రిపోర్టర్ )..