BREAKING
జార్ఖండ్‌లో ఘనంగా ముగిసిన ఛఠ్ పూజ వేడుకలు ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు రావణాసురుడు ఒరిజినల్ టెక్ బ్రో.. టెక్ బిలియనీర్లతో పోల్చిన ట్వింకిల్ ఖన్నా! జాతీయ పత్రికా దినోత్సవం: మీడియా భవిష్యత్తుపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు! నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చివేత.. రూ.6 లక్షల నష్టం! • ప్రజావాణిలో బాధితుడి ఆవేదన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ విధ్వంసం.. 11 రోజుల్లో రూ.1,384 కోట్లతో పలు రికార్డులు బద్దలు! అంతర్జాతీయ వాణిజ్య మేళాలో బీహార్ పెవిలియన్ సందడి: ఆకట్టుకుంటున్న మినీ-మ్యూజియం! నటుడు శరద్ కపూర్‌ను కలిసిన సోనూసూద్.. అనారోగ్య పరిస్థితిపై ఆరా! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం కైరోలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు! ప్రజావాణికి మూడు దరఖాస్తులు సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్!

ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే

Select Suryaa Now
ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే .

తిరుపతి: టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ వైద్య, పరిశోధనా సంస్థ (SVICCAR)తో అనుబంధం కలిగిన ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ శైలేష్ వి. శ్రీఖండే  అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, ఎల్సెవియర్ సంస్థలు కలిసి ప్రకటించిన 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచంలోని అత్యుత్తమ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆయనకు స్థానం దక్కింది. క్యాన్సర్ చికిత్స, పరిశోధన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది.
డాక్టర్ శ్రీఖండే భారతదేశంలోని ప్రముఖ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుల్లో ఒకరు. ముఖ్యంగా క్లోమగ్రంథి (ప్యాంక్రియాస్) క్యాన్సర్, జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. క్యాన్సర్ చికిత్స, వైద్య పరిశోధనలు, వైద్య విద్య రంగాల్లో ఆయన చేసిన సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
టాటా క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన, తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ శ్రీఖండే గారు కీలకంగా కృషి చేస్తున్నారు. తిరుపతిలోని  క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిరంతరం పనిచేస్తోంది.
అవసరమైనప్పుడు డాక్టర్ శ్రీఖండే   ప్రత్యేక వైద్య సలహాలు ఇవ్వడంతో పాటు, క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తారు. దీనివల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజలు తమకు దగ్గరలోనే అనుభవజ్ఞులైన క్యాన్సర్ వైద్య నిపుణుల సేవలను పొందే అవకాశం ఉంది.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి