ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరం
ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరం
-చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి మురళి
ప్రస్తుత తరుణంలో ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరమని చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి మురళి అన్నారు.జాతీయ నూనె గింజల పథకం కింద ఆముదం పంట సాగుపై శిక్షణ మండలంలోని రాజుపల్లి రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 వ తేదీ లోపల ఆముదం పంటను విత్తుకోవాలని సూచించారు.పంట విత్తిన 48 గంటల లోపల పెండిమితాలిన్ మందు వాడి కలుపు సమస్య నివారించు కోవచ్చుని, ఆముదం లో వచ్చే చీడ పీడల నివారణ గూర్చి రైతులకు వివరించారు. ప్రస్తుత తరుణం లో ఆముదం పంట తక్కువ నీటితో ఒక ఎకరాకి 10 నుండి 12 కుంటాళ్లు దిగుబడి సాధించి అధిక ఆదాయాన్ని పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి హేమలత, శాస్త్రవేత్తలు కృష్ణారెడ్డి , బాలహుస్సేన్ రెడ్డి, ఏ డి ఏ లక్ష్మీ ప్రసన్న మరియు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి