BREAKING
జార్ఖండ్‌లో ఘనంగా ముగిసిన ఛఠ్ పూజ వేడుకలు ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు రావణాసురుడు ఒరిజినల్ టెక్ బ్రో.. టెక్ బిలియనీర్లతో పోల్చిన ట్వింకిల్ ఖన్నా! జాతీయ పత్రికా దినోత్సవం: మీడియా భవిష్యత్తుపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు! నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చివేత.. రూ.6 లక్షల నష్టం! • ప్రజావాణిలో బాధితుడి ఆవేదన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ విధ్వంసం.. 11 రోజుల్లో రూ.1,384 కోట్లతో పలు రికార్డులు బద్దలు! అంతర్జాతీయ వాణిజ్య మేళాలో బీహార్ పెవిలియన్ సందడి: ఆకట్టుకుంటున్న మినీ-మ్యూజియం! నటుడు శరద్ కపూర్‌ను కలిసిన సోనూసూద్.. అనారోగ్య పరిస్థితిపై ఆరా! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం కైరోలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు! ప్రజావాణికి మూడు దరఖాస్తులు సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్!

కవితా పఠనంతో సభను అలరించిన యువకవి నీలం గేదెల..

Select Suryaa Now
కవితా పఠనంతో సభను అలరించిన యువకవి నీలం గేదెల..

 

శ్రీకాకుళం నవంబర్ 16 మేజర్ న్యూస్ :సాహిత్య వేదికపై తన కవితా ప్రతిభతో యువ కవి నీలం గేదెల ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 177వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం ‘విజయనగర కవితా వైభవం’ కార్యక్రమంలో రాళ్లపాడు కాలనీకి చెందిన నీలం గేదెల తన కవితా పఠనంతో సభికులను ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన ‘విజయనగర ఉత్సవం’ అనే శీర్షికతో వినిపించిన కవిత విజయనగర చారిత్రక వైభవాన్ని, తెలుగు భాషా సాహిత్య సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ శ్రోతల ప్రశంసలు అందుకుంది. యువ కవిలోని సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ ప్రతిభకు సభలోని ప్రముఖులు అభినందనలు తెలిపారు.

అనంతరం శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఎం.ఈ.ఓ డబ్బీర్ గోవిందరావు, జాతీయ ప్రణాళికా కార్యదర్శి, రిటైర్డ్ డీఈఓ టీ. పార్థసారథి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంచాలకులు, శ్రీ శ్రీ కళా వేదిక కన్వీనర్ సముద్రాల గురు ప్రసాద్ తదితర ప్రముఖులు యువ కవి నీలం గేదెలను ఘనంగా సత్కరించారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసి ఆయన సాహిత్య ప్రతిభను అభినందించారు.

యువతలో తెలుగు భాష పట్ల ఆసక్తిని, సాహిత్య అభిరుచిని పెంపొందిస్తూ కవితా రంగంలో నీలం గేదెల మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.