అంతర్జాతీయ వాణిజ్య మేళాలో బీహార్ పెవిలియన్ సందడి: ఆకట్టుకుంటున్న మినీ-మ్యూజియం!
సూర్య నేషనల్ డెస్క్ (న్యూఢిల్లీ): దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా లో ‘బీహార్ పెవిలియన్’సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేళా ప్రాంగణంలోని గేట్ నంబర్ 2 సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్, బీహార్ రాష్ట్ర ఆధునిక అభివృద్ధితో పాటు ఆ రాష్ట్ర ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తోంది.
ఈ పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ-మ్యూజియం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో బీహార్ ప్రాచీన నాగరికతకు, గొప్ప చరిత్రకు అద్దం పట్టే పురాతన శిల్పాలు , వివిధ దేవతా విగ్రహాలు మరియు అరుదైన చారిత్రక కళాఖండాలనుప్రదర్శనకు ఉంచారు. రాష్ట్రంలోని మ్యూజియం సంస్కృతిని, చారిత్రక వైభవాన్ని జాతీయ, అంతర్జాతీయ సందర్శకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా వీటిని తీర్చిదిద్దారు.
మరోవైపు, బీహార్ హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు, పారిశ్రామిక ప్రగతి మరియు పర్యాటక ప్రాంతాల విశిష్టతను కూడా ఈ పెవిలియన్‌లో చాటిచెబుతున్నారు. వాణిజ్య మేళాకు తరలివస్తున్న సందర్శకులు బీహార్ పెవిలియన్‌ను సందర్శిస్తూ, అక్కడి ప్రాచీన కళాఖండాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.