BREAKING
జార్ఖండ్‌లో ఘనంగా ముగిసిన ఛఠ్ పూజ వేడుకలు ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య.. ప్రజావాణిలో ఫిర్యాదు రావణాసురుడు ఒరిజినల్ టెక్ బ్రో.. టెక్ బిలియనీర్లతో పోల్చిన ట్వింకిల్ ఖన్నా! జాతీయ పత్రికా దినోత్సవం: మీడియా భవిష్యత్తుపై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు! నోటీసులు ఇవ్వకుండానే షాపు కూల్చివేత.. రూ.6 లక్షల నష్టం! • ప్రజావాణిలో బాధితుడి ఆవేదన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ విధ్వంసం.. 11 రోజుల్లో రూ.1,384 కోట్లతో పలు రికార్డులు బద్దలు! అంతర్జాతీయ వాణిజ్య మేళాలో బీహార్ పెవిలియన్ సందడి: ఆకట్టుకుంటున్న మినీ-మ్యూజియం! నటుడు శరద్ కపూర్‌ను కలిసిన సోనూసూద్.. అనారోగ్య పరిస్థితిపై ఆరా! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూతః మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం కైరోలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు! ప్రజావాణికి మూడు దరఖాస్తులు సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్!

సమాజానికి దిక్సూచి పాత్రికేయులు...

Select Suryaa Now
సమాజానికి దిక్సూచి పాత్రికేయులు...

 

నరసన్నపేట, నవంబర్ 16 మేజర్ న్యూస్: ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజంలో జరిగే మంచి చెడులను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజా చైతన్యానికి జర్నలిస్టులు దిక్సూచిగా నిలుస్తున్నారని విజ్ఞాన భారతి పాఠశాల ప్రధానాచార్యులు ఢిల్లేశ్వరరావు పేర్కొన్నారు.

జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నరసన్నపేటలోని విజ్ఞాన భారతి పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక సీనియర్ పాత్రికేయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సదాశివుని కృష్ణ, ప్రభు శర్మ, మామిడి రవి, రెడ్డి అరవింద్, గోపాలకృష్ణలను పాఠశాల యాజమాన్య ప్రతినిధులు నానాజీ గాడ్గే, కె.ఎల్.ఎన్. మూర్తి, మహేష్, ప్రధానాచార్యులు ఢిల్లేశ్వరరావు తదితరులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో, సమాజానికి సరైన సమాచారాన్ని అందించడంలో విశేష కృషి చేస్తోందన్నారు. నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడుతున్న పాత్రికేయుల సేవలను గుర్తించడం అభినందనీయమన్నారు.

సత్కారం అందుకున్న పాత్రికేయులు మాట్లాడుతూ.. పత్రికా రంగ సేవలను గుర్తించి విద్యాసంస్థ స్థాయిలో గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో విజ్ఞాన భారతి పాఠశాల చేస్తున్న కృషిని అభినందించారు. భవిష్యత్తులో విద్యారంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పి.రమణమూర్తి, సూర్యనారాయణ, చౌదరి శ్రీదేవి, అరుణకుమారి, అనురాధ, హేమకుమారి, రేవతి,  తదితరులు పాల్గొన్నారు. చివరగా శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

 బి.గోపాలకృష్ణ( నరసన్నపేట)