BREAKING
రైతు సంఘాలకు సబ్సిడీతో వ్యవసాయ యంత్ర పరికరాలు - కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం కైరోలో ఈజిప్ట్ విదేశాంగ మంత్రితో పీయూష్ గోయల్ ద్వైపాక్షిక చర్చలు! ప్రజావాణికి మూడు దరఖాస్తులు సాహిత్య పోటీల్లో కొండపాక విద్యార్థుల ప్రతిభ మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి గెలుపే మన అందరి లక్ష్యం : జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.. నాలుగు విడాకులపై అభిమాని జోక్.. జెన్నిఫర్ లోపెజ్ ఫన్నీ రియాక్షన్ వైరల్! పుణె హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్ షా! ఆముదం పంట విత్తుకోవడం శ్రేయస్కరం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి కృష్ణవంశీతో విడాకుల పుకార్లు.. పెళ్లి ఓవర్‌రేటెడ్ అంటూ రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! సమాజానికి దిక్సూచి పాత్రికేయులు... అజిత్ కుమార్‌కు విలన్‌గా శివరాజ్ కుమార్.. 'డేర్ డెవిల్' మూవీపై క్రేజీ అప్‌డేట్! బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం: కదలికలపై ఏపీఎస్‌డీఎంఏ అప్‌డేట్! కవితా పఠనంతో సభను అలరించిన యువకవి నీలం గేదెల.. ప్రపంచంలోని టాప్ శాస్త్రవేత్తల జాబితాలో చోటు సంపాదించిన డా. శైలేష్ వి. శ్రీఖండే

గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

Select Suryaa Now
గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ విడుదల..*  *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి*

 


కర్నూలు, నవంబర్ 16 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు - 2026 రెండవ విడత ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, కర్నూలు జిల్లాలో రెండవ విడతలో 9 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి తెలిపారు.

*ఎన్నికల షెడ్యూల్ వివరాలు:*

- *నవంబర్ 18–20:* నామినేషన్ల స్వీకరణ.

- *నవంబర్ 21:* ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.

- *నవంబర్ 22:* సాయంత్రం 5 గంటల వరకు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం.

- *నవంబర్ 23:* అప్పీళ్ల పరిష్కారం.

- *నవంబర్ 24:* మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం.

- *నవంబర్ 24:* మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన.

- *నవంబర్ 29:* ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్.

- *నవంబర్ 29:* మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ.

- *నవంబర్ 30:* అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్, అనంతరం ఫలితాల ప్రకటన.


*కర్నూలు జిల్లాలో రెండవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల వివరాలు :*

-కర్నూలు జిల్లాలో రెండవ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం 9 మండలాల్లో జరగనున్నాయని, ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని కోసిగి, కౌతాళం, మంత్రాలయం, పెద్దకడబూరు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు  మండలాలు, కర్నూలు రెవెన్యూ డివిజన్ లోని కల్లూరు, ఓర్వకల్లు  మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు