BREAKING
సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి సంజీవని’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు ఆపదలో ఉన్న పాత్రికేయుడికి మున్సిపల్ చైర్మన్ ఆపన్నహస్తం : రూ.30 వేలు ఆర్థిక సాయం అందించి శ్రీరామ్ చినబాబు బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు? పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి – జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
క్రీడల్లోనూ బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి  – జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎం.జె.పి. గురుకుల బాలికల పాఠశాలలో గత ఆరు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వార్షిక క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. నవంబర్ 11న ప్రారంభమైన ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 ఎం.జె.పి. గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు.
ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలికలు చదువుతోపాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. నేటి విద్యార్థినులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు అధిక సమయం కేటాయించకుండా ప్రతిరోజూ కనీసం గంటసేపు మైదానంలో క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. దీనివల్ల ఆరోగ్యంతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంత బాలికల్లో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నిరంతరం సాధన చేయాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా ద్వారా లభిస్తున్న అవకాశాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమికి కుంగిపోకుండా దానిని విజయానికి పునాదిగా భావించి పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థినులకు సూచించారు.ఈ పోటీల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, చెస్, టెన్నికాయిట్‌తోపాటు వివిధ అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం ఆయా క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థినులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.జె.పి. స్పోర్ట్స్ ఓఎస్డీ శ్రీనివాస్, ఆర్సీవో శ్రీధర్, పాఠశాల ప్రిన్సిపాల్ కీర్తి, పీడీ శైలజ, పీఈటీ పి. స్వాతి, ఉమ్మడి జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, పీడీలు, పీఈటీలు, విద్యార్థినులు పాల్గొన్నారు.