భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బోయా కమ్యూనిటీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయా నాగేష్ ఫిర్యాదు దాఖలు చేశారు. భారత్ సమ్మిట్–2026 కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేసి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.