BREAKING
సాయంత్రం కోర్టుల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి సంజీవని’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజీవ్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు ఆపదలో ఉన్న పాత్రికేయుడికి మున్సిపల్ చైర్మన్ ఆపన్నహస్తం : రూ.30 వేలు ఆర్థిక సాయం అందించి శ్రీరామ్ చినబాబు బీసీలకే క్రిమిలేయర్‌ ఆంక్షలెందుకు? పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనూప్ సత్యన్, మోహన్ లాల్ 'ఎల్ 368' చిత్రం.. కర్ణాటకలో రెండో షెడ్యూల్ సెట్ పనులు! దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం గోమాత సేవతో హిందూ సంప్రదాయాలకు గౌరవం అద్దంకిలో 'ధరణి' బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం. ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత్ సమ్మిట్ బ్యానర్ వివాదంపై డీజీపీకి బోయా నాగేష్ ఫిర్యాదు 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సందర్శన - జెండా ఊపి పర్యటనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Select Suryaa Now
ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుక.. దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఆకాశంలో ఒక తార (ఏఓటీ) విడుదలకు సిద్ధమవుతోంది. సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ కృష్ణ పాత్రలో కనిపించనుండగా, కొత్త నటి సాత్విక వీరవల్లి కల్పన అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేదికపై దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ తన తొలి సినిమా సెకండ్ షో నాటి అల్లు అర్జున్ జ్ఞాపకాన్ని పంచుకున్నారు. కోజికోడ్‌లోని ఒక మారుమూల గ్రామంలో సెకండ్ షో షూటింగ్ జరిగిన రోజుల్లో, తన పాత్ర ఇంటిగా వాడిన నివాసంలోని అల్మారాపై అల్లు అర్జున్ ఫోటో కనిపించిందని, అప్పుడే సుదూర ప్రాంతాల్లోనూ తెలుగు హీరోలకు ఎంతటి ఆదరణ ఉందో అర్థమైందని దుల్కర్ గుర్తు చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో తమ కుటుంబ సభ్యులందరూ అల వైకుంఠపురములో సినిమా చూసి అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానులుగా మారారని, ఉర్దూ మాట్లాడే తన భార్య బంధువులకు కూడా ఆ సినిమా ఎంతగానో నచ్చిందని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ కొత్త సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దర్శకుడు పవన్ సాధినేని గురించి మాట్లాడుతూ దాదాపు ఐదేళ్ల పాటు తన కోసం ఓపికగా ఎదురుచూసి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన తీరును దుల్కర్ ప్రశంసించారు. షూటింగ్ తొలినాళ్లలో పవన్ సాధినేని రాత్రిపూట కూడా సన్‌గ్లాసెస్ ధరించి కనిపించడం తనలో ఆసక్తి రేకెత్తించిందని, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు పవర్ గ్లాసెస్ మర్చిపోవడం వల్ల సన్‌గ్లాస్ లెన్స్‌తోనే ఆయన అలా చేయాల్సి వచ్చిందని తరువాత తెలిసిందని సరదాగా వివరించారు.

మరోవైపు అల్లు అర్జున్ మాట్లాడుతూ మలయాళ సినీ దిగ్గజం మమ్మూట్టి తనయుడైనప్పటికీ దుల్కర్ సల్మాన్‌లో ఎప్పుడూ ఎలాంటి అహంకారం గానీ, గర్వం గానీ కనిపించలేదని కొనియాడారు. ఉస్తాద్ హోటల్ నుంచి దుల్కర్ నటించిన అనేక చిత్రాలను తాను చూశానని, కథల ఎంపికలో ఆయన చూపిస్తున్న వైవిధ్యం అద్భుతమని పేర్కొన్నారు. తొలిసారి కలిసినప్పుడే ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలా దుల్కర్ అనిపించారని, ప్రతి మహిళ కల నెరవేరే ఆలోచనతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అల్లు అర్జున్ విశ్వాసం వ్యక్తం చేశారు.