ఆపదలో ఉన్న పాత్రికేయుడికి మున్సిపల్ చైర్మన్ ఆపన్నహస్తం : రూ.30 వేలు ఆర్థిక సాయం అందించి శ్రీరామ్ చినబాబు
మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : వంద రూపాయల సాయాన్ని సైతం కోటి రూపాయలుగా ప్రచారం చేసుకునే ప్రస్తుత రోజుల్లో ప్రచార ఆర్భాటాలకు దూరంగా,ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు) చాటిచెప్పారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ కాలు కోల్పోయి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న హాన్స్ ఇండియా దినపత్రిక సీనియర్ పాత్రికేయుడి యుగంధర్ (చిన్న) పరిస్థితిని తెలుసుకున్న చినబాబు వెంటనే స్పందించి,రూ.30,000 ఆర్థిక సాయాన్ని ఫోన్‌పే ద్వారా అందజేశారు.తన కష్టకాలంలో మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థికంగా అండగా నిలిచిన చినబాబు ఔదార్యానికి యుగంధర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చినబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మనసే నిజమైన గొప్పతనం.ఆర్థిక సాయం విలువ కంటే,ఆపన్నహస్తం అందించిన ఆప్యాయత ఎంతో గొప్పదని మిత్రులు తెలిపారు.
రిపోర్టర్ : కే. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి