ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సూర్య,రాయికల్:ఖాళీ స్థలం ఉన్న అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేస్తామని,జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ అభివ్రుద్ది కి కృషి చేస్తున్నానని అమృత్ కార్యక్రమంలో భాగంగా 16లక్షల లీటర్ల మంచి నీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగిందనీ, రాయికల్ పట్టణంలో 230 ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తామని అన్నారు.