telangana
70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు – సెలక్షన్ టోర్నమెంట్‌లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
సూర్య ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా పోటీలు (సిమెంట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్) 2026–27 అండర్-14 విభాగం బాలురు, బాలికల క్రీడా కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్ గారు, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సిబ్బంది, క్రీడా నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.