BREAKING
పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం అద్దంకి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 కైవసం. జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాడంగిలో టీడీపీ విజయభేరి! జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది

గౌడవల్లి పెద్ద చెరువు శిఖం భూమిలో అక్రమ ప్లాట్లు.. రూ.10 కోట్ల ప్రభుత్వ భూమిపై వివాదం

Select Suryaa Now
గౌడవల్లి పెద్ద చెరువు శిఖం భూమిలో అక్రమ ప్లాట్లు.. రూ.10 కోట్ల ప్రభుత్వ భూమిపై వివాదం

మేడ్చల్, మేజర్ న్యూస్: ప్రభుత్వ భూములకు రక్షణ కరువవుతోందా..? చెరువులు, కుంటలను పరిరక్షించాల్సిన అధికారుల పర్యవేక్షణలోనే ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని గౌడవల్లి గ్రామ పెద్ద చెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 237లో సుమారు ఎకరం మేర ఉన్న చెరువు శిఖం భూమిని ఆక్రమించి ప్లాట్లుగా విభజించి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన చెరువు భూమిని ప్రైవేటు భూమిగా చూపించి విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రమేయం ఉందంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చెరువు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన వారిపైనే ఆరోపణలు రావడం స్థానికంగా చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సర్వే నంబర్ 237లోని భూమిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ రికార్డులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధులను పరిశీలించి భూమి స్వరూపాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమ విక్రయాలను అడ్డుకుని చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి వ్యవహారంపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.