BREAKING
మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శం నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన * జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం చైర్మన్ వర్గం లోపారి ఒప్పందమే శంబరలో అభ్యర్థి ఓటమి.?

ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా?

Select Suryaa Now
ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా?

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామ పరిధిలోని చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. వరుస రోడ్డు ప్రమాదాలతో ఈ ప్రాంతం వాహనదారులకు మృత్యుమార్గంగా మారుతున్నా సంబంధిత అధికారులు మాత్రం శాశ్వత నివారణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదాల్లో రెండు నిండు ప్రాణాలు బలికాగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రయాణిస్తున్న కారు కూడా ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశమైంది. తాజాగా శనివారం మరోసారి రెండు కార్లు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లలో ముందు వెళ్తున్న కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.