కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు
చిట్టమూరు మేజర్ న్యూస్
కోగిలి సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కమతం చెంగయ్య 454 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయోత్సాహంతో స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయం వెనుక పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి కీలకంగా నిలిచింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,మైనార్టీ సెల్ చిట్టమూరు మండల అధ్యక్షులు షేక్ రషీద్ ఎన్నికల ప్రచారంలో క్రియాశీలక పాత్ర పోషించారు.అభ్యర్థి కమతం చెంగయ్యకు అండగా నిలుస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రతి పేద కుటుంబాన్ని పలకరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టడంలో విశేషంగా కృషి చేశారు.ప్రతి ఓటును కీలకంగా భావించి, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా షేక్ రషీద్ పనిచేశారు.ఆయన పట్టుదల,నాయకత్వం, కార్యకర్తల సమష్టి కృషి విజయానికి దోహదపడ్డాయని స్థానిక నాయకులు పేర్కొన్నారు.కమతం చెంగయ్య విజయంపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు,మండల స్థాయి నాయకులు అభినందనలు తెలియజేశారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రతిఫలం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ,తనపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ,కోగిలి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్