BREAKING
భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు పండుగ సాయన్న జీవితం అందరికీ ఆదర్శం నెల్లిమర్లలో కూటమి హవా.. *ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ, జనసేన * జడ్పిటిసిగా టిడిపి అభ్యర్థి వెంకటమ్మ ఘన విజయం ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం చైర్మన్ వర్గం లోపారి ఒప్పందమే శంబరలో అభ్యర్థి ఓటమి.? జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ పాలకొండ జడ్పిటిసి గా వెంకట్రావు

అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్.

Select Suryaa Now
అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ.  7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్.

సూర్య అద్దంకి.

7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. 
అద్దంకి జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మానం మురళి మోహన్ దాస్ సంచలన విజయం నమోదు చేశారు. మొత్తం ఐదు రౌండ్లు మరియు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముగిసేసరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ సీపీ అభ్యర్థి అవిశన ప్రభాకర్ రెడ్డిపై 7,650 ఓట్ల భారీ మెజారిటీతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి గెలుపొందారు. అద్దంకి మండలంలో మొత్తం 40,096 మంది ఓటర్లు ఉండగా 28,352 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 27, 840 ఓట్లు చెల్లుబాటు కాగా, టిడిపికి 17,702 ఓట్లు, వైసీపీకి 10,052, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి 86 ఓట్లు పోలయ్యాయి, నోటా కు 143 పోలవ్వగా, 369 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వైసిపి అభ్యర్థి పై తెదేపా అభ్యర్థి మానం మురళీమోహన్ దాస్ 7,650 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు, అలాగే పోస్టల్ బ్యాలెట్లలోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన మానం మురళి మోహన్ దాస్ ఏకపక్ష విజయంతో అద్దంకి మండలంలోని టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.