BREAKING
ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు కంబదూర్ లో పరోక్ష ఎన్నికకు సర్వం సిద్ధం. దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి బ్రహ్మసముద్రం మండలం తీట కల్లులో 8కి 8 వార్డులు ఏకగ్రీవం, టిడిపి కైవాసం. అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు 11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి... - కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలకు ICAR గుర్తింపు బంగి నాగేంద్ర కు అనంత డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాలను పలు వైఎస్ఆర్సిపి వార్డులు ఏకగ్రీవం. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు

Select Suryaa Now
ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి  - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు

 

సూర్య - పెద్దపల్లి రూరల్ : ఎన్టీపీసీ నుంచి బూడిద రవాణా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎలాంటి ప్రభుత్వ జీవో, సర్క్యులర్ లేకుండానే ఒక్కో లారీకి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని, గత మూడేళ్లలో సుమారు రూ.6 కోట్ల మేర అక్రమ వసూళ్లు చేశారని విమర్శించారు.
బూడిద రవాణా చేసే లారీలకు స్కానర్లు ఏర్పాటు చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 265 ప్రకారం చట్టబద్ధమైన అనుమతి లేకుండా పన్నులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మట్టి తవ్వకాల విషయంలోనూ నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు వసూలు చేయాల్సి ఉండగా, రూ.3,500 వరకు వసూలు చేస్తూ లారీ యజమానులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లను ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, లారీలను సీజ్ చేస్తూ వేధించడం దారుణమన్నారు.
బూడిద రవాణా పేరుతో వసూలు చేసిన మొత్తాలను లారీల నంబర్ల ఆధారంగా గుర్తించి సంబంధిత యజమానులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీబీఐ, ఈడీ, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని కోరుకంటి చందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ సదయ్య, నాయకులు నారాయణదాసు మారుతి, కొమ్రేష్ jలారీ యజమానులు పల్లె అశోక్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.