BREAKING
క్రమశిక్షణతో పనిచేసి గ్రంథాలయ సంస్థకు మంచి పేరు తీసుకురావాలి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ : ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు నామినేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారి ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు కంబదూర్ లో పరోక్ష ఎన్నికకు సర్వం సిద్ధం. దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి బ్రహ్మసముద్రం మండలం తీట కల్లులో 8కి 8 వార్డులు ఏకగ్రీవం, టిడిపి కైవాసం. అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు 11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

Select Suryaa Now
   గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

 బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆ పంచాయతీ పరిధిలో ఉన్న 14 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. 10 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా ఉండటం, మిగిలిన నాలుగు పోలింగ్ కేంద్రాలు తీవ్రసమస్యాత్మకమైనవిగా ఉండటంపై ఆయన నిశితంగా పరిశీలించారు. బేతపూడి పంచాయతీలో గత ఎన్నికలలో జరిగిన సంఘటనలు, భద్రత చర్యలపై ఆరా తీశారు. ఆ పంచాయతీలో 5,250 మంది జనాభా ఉండగా,  3,176 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు కలెక్టరేట్ దృష్టికి తెచ్చారు. ఆ పంచాయతీలో 14 వార్డులు ఉండగా, ఒక్కొక్క వార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం చొప్పున 14 కేంద్రాలు ఉండడంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
       
    గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు కట్టుతదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువార్టుపురం పంచాయతీలకు బేతపూడిలోనే నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలు పునరావృతం గాకుండా అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. స్వర్ణ గ్రామ సచివాలయం, పంచాయతీ కార్యాలయం, సాల్వేషన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, రైతు సేవా కేంద్రం, అంగన్వాడి కేంద్రాలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. 
      
      తుపాన్ హెచ్చరిక నేపథ్యంలో పేరళి కెనాల్ పూడిక తీత పనులు వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిస్తే వర్షం నీరు పొంగిపొర్లకుండా కాల్వను శుభ్రం చేయాలన్నారు. విపత్తు రాకముందే సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
    
         ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ హరికుమార్, బాపట్ల డి డి ఓ పద్మజ, ఆర్ అండ్ బి డీఈ అరుణ కుమారి, తహసిల్దార్ షాలిమా, తదితరులు పాల్గొన్నారు.