నామినేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారి
కైకలూరు, మేజర్ న్యూస్, కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు ప్రారంభమైన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రూరల్ సీఐ వి. రవికుమార్ ఆయా మండలాల ఎస్సైలతో కలిసి నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను, పోలీస్ బందోబస్తును పరిశీలించి, విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
రిపోర్టర్. ఎం రమేష్ కైకలూరు ఏలూరు జిల్లా