విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం రైతుకు ఆర్థిక సహాయం అందించిన ఎస్సై నీరేష్
కౌడిపల్లి : కౌడిపల్లి మండల కేంద్రంలోని ము ముట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన రైతు తలారి అంజయ్య (తండ్రి సాయిలు) బుధవారం పశువుల మేత కోసం తన పొలం నుంచి ట్రాక్టర్‌లో వరిగడ్డిని తీసుకొస్తుండగా అనుకోకుండా ప్రమాద వశాత్తూ విద్యుత్ వైర్ లు తాకి ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని రహదారిపై వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టర్‌పై ఉన్న వరిగడ్డి మోపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తంగా వ్యవహరించడంతో ట్రాక్టర్‌ను పెను ప్రమాదం నుంచి తప్పించగలిగారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న కౌడిపల్లి ఎస్సై నిరేష్, కానిస్టేబుల్ మధు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. ప్రమాదంలో వరిగడ్డిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన రైతు అంజయ్యకు ఎస్సై నిరేష్ తన వంతు సహాయంగా రూ.4,000 ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో రైతుకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్న ఎస్సైను గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ, వెంకటేశం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.