ఛలో సిద్దిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ... నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ....
నర్సాపూర్ ; నర్సాపూర్ పట్టణంలోని రాఘవేంద్ర హాల్‌లో నిర్వహించిన ఛలో సిద్దిపేట కార్యక్రమ సన్నాహక సమావేశానికి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయ్ కుమార్ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి శోభారాణి హాజరయ్యారు.ఈ సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చలో సిద్దిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.