ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లబ్దిదారులను గుర్తించాలి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్
తూప్రాన్, :రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ మున్సిపల్ మరియు మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి వివరాలను ఖచ్చితంగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. లబ్ధిదారులు రేషన్ కార్డు: కుటుంబ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఓటీపీ ధృవీకరణ కోసం సిద్ధం గా ఉంచుకోవాలని అన్నారు.మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పించాలని, అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సూచించాలని కమిషనర్ రమేష్ కుమార్, పేర్కొన్నారు,