చేయూత పింఛన్లతో పేదల కళ్ళల్లో ఆనందం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ..
అమీన్ పూర్ ; అమీన్ పూర్, బీరంగూడ సర్కిల్ లబ్ధిదారులకు కొత్త పింఛన్ల పంపిణీ, మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదగా బుధవారం మంజూరు పత్రాలు అందజేత, అమీన్పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ సర్కిల్ కు చెందిన అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు నూతన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుమ్మడిదల టోల్గేట్ సమీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో బీరంగూడ సర్కిల్ పరిధిలోని పలువురు అర్హులైన పేదలకు ఈ నూతన పింఛన్లు మంజూరయ్యాయి. మంత్రి చేతులమీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు తమ కళ్ళల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమకు ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వానికి, కాటా శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమీన్పూర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కాట శ్రీనివాస్ గౌడ్ నిరంతర కృషి వల్లే బీరంగూడ సర్కిల్ లోని అర్హులకు త్వరి తగతిన పింఛన్లు మంజూరయ్యాయని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.